Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ కు సీఎం రేవంత్ రూ. కోటి బహుమతి

Rahul Sipligunj gets Rs 1 crore reward from CM Revanth
--
తెలంగాణ బోనాల పండుగ వేళ హైదరాబాదీ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ప్రభుత్వం రూ. కోటి నజరానా ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు అందించారు. రాష్ట్ర యువతకు రాహుల్ సిప్లిగంజ్ ఆదర్శనీయమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నటీనటులకు గద్దర్ ఫిలిం అవార్డ్స్ అందించిన విషయం తెలిసిందే. ఈ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రస్తావించారు.

రాహుల్ కు ప్రత్యేక అవార్డును ప్రకటించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే బోనాల పండుగ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రూ. కోటి నగదు పురస్కారం అందజేశారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్.. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పాడిన ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. మార్చి 2023 లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల వేడుకలో ఈ పాటను ప్రదర్శించారు.
Rahul Sipligunj
Revanth Reddy
Telangana Bonalu
Naatu Naatu song
RRR movie
Oscar Award
Bhatti Vikramarka
Gaddar Film Awards
Hyderabad Singer
Telangana Government

More Telugu News