విజ‌య‌వాడ ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డి

  • ఏపీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో నిన్న అరెస్ట‌యిన మిథున్ రెడ్డి
  • ఈరోజు వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం విజ‌య‌వాడ ఏసీబీ కోర్టులో హాజ‌రుప‌ర్చిన సిట్ అధికారులు
  • మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాల‌ని కోర‌నున్న సిట్ అధికారులు 
  • ఈ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ
ఏపీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు సంస్థ (సిట్‌) శ‌నివారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ4గా ఉన్న ఆయ‌న‌ను తాజాగా సిట్ అధికారులు విజ‌య‌వాడ ఏసీబీ కోర్టులో హాజ‌రుప‌రిచారు. అంత‌కుముందు వైద్య ప‌రీక్ష‌ల కోసం సిట్ కార్యాల‌యం నుంచి విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. 

అక్క‌డ బీపీ, ఈసీజీ, షుగ‌ర్ త‌దిత‌ర ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు.. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేవ‌ని చెప్ప‌డంతో ఏసీబీ కోర్టుకు త‌ర‌లించారు. మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాల‌ని సిట్ అధికారులు న్యాయ‌స్థానాన్ని కోర‌నున్న‌ట్టు తెలుస్తోంది. మ‌ద్యం పాల‌సీ రూప‌క‌ల్ప‌న‌లో ఆయ‌నే కీల‌క‌మ‌ని సిట్ గుర్తించిన సంగ‌తి తెలిసిందే. నిన్న సుమారు ఏడు గంట‌ల పాటు విచారించిన అనంత‌రం మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.


More Telugu News