నవ్వులు పూయిస్తున్న మోహన్ లాల్ ‘హృదయపూర్వం’ టీజర్
- మోహన్ లాల్, సత్యన్ అంతికాడ్ కాంబోలో 'హృదయపూర్వం'
- ఆగస్టు 28న విడుదల కానున్న సినిమా
- టీజర్‌లో తన సహజమైన హాస్యంతో, అలరించే నటనతో ఆకట్టుకున్న లల్లెట్టన్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం 'హృదయపూర్వం'. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఫన్నీగా ఉండి.. నవ్వులు పూయిస్తోంది. మోహన్ లాల్ తన సహజమైన హాస్యంతో, అలరించే నటనతో టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది.
ఇక, ఈ ఏడాది ఇప్పటికే ‘ఎల్2: ఎంపురాన్’, ‘తుడరుమ్’ వంటి యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలతో సూపర్ హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న మోహన్ లాల్ ఇప్పుడు 'హృదయపూర్వం' అంటూ క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీకి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించగా... మాళవిక మోహనన్ కథానాయికగా నటించారు.
అలాగే ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరుంబావూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.