ఒకేసారి ఒకే వేదికపై ఒకే మహిళను పెళ్లాడిన ఇద్దరు సోదరులు.. వీడియో ఇదిగో!
- సిమ్లాలో బంధుమిత్రుల మధ్య ఘనంగా వివాహం
- సంప్రదాయం కొనసాగిస్తున్నందుకు గర్వంగా ఉందన్న జంట
- హిమాచల్ లో గత ఆరేళ్లలో ఇలా ఐదు వివాహాలు..
హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో ఒకే మహిళను ఇద్దరు అన్నదమ్ములు ఒకే వేదికపై వివాహం చేసుకున్నారు. వందలాదిమంది బంధుమిత్రులు ఈ వివాహానికి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. మండపంలో ఒకే వధువుతో అన్నదమ్ముల వివాహం ఘనంగా జరిగింది. ఒకే మహిళను ఇద్దరు సోదరులు ఒకే సమయంలో వివాహం చేసుకోవడం తమ తెగలో కొనసాగుతూ వస్తున్న పురాతన సంప్రదాయమని, ఇటీవల ఈ సంప్రదాయాన్ని ఎవరూ పాటించడంలేదని నూతన వధూవరులు చెప్పారు. అయితే, ఈ వివాహం తాము ముగ్గురం కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయమని వారు వివరించారు. ఈ వివాహం తమకు గర్వకారణమని చెప్పారు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వివాహానికి సంబంధించిన వివరాలు.. సిమ్లాలోని కున్హాట్ గ్రామానికి చెందిన సునీతను షిల్లాయ్ గ్రామానికి చెందిన సోదరులు ప్రదీప్, కపిల్ నేగి వివాహం చేసుకున్నారు. ఈ ఆచారాన్ని తమ తెగలో జోడిదారాగా వ్యవహరిస్తారని వారు వివరించారు. కాగా, ప్రదీప్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా.. కపిల్ నేగి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం తర్వాత తాను ఎక్కువ రోజులు తమ భార్యతో కలిసి ఉండలేనని చెబుతూ.. ఈ వివాహం ద్వారా తాను దూరంగా ఉన్నప్పటికీ తమ బంధం పటిష్టంగానే ఉంటుందని ఆయన చెప్పారు. ఈ వివాహం తమ ముగ్గురి సమ్మతితోనే జరిగిందని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదని ముగ్గురూ స్పష్టం చేశారు.
హిమాలయ ప్రాంతంతో పాటు తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో నివసించే పలు తెగల్లో ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. కుటుంబానికి ఉన్న పరిమిత వనరులు (భూమి, ఇతర ఆస్తులు), కుటుంబం ముక్కలు కాకుండా అన్నదమ్ములు (ఇద్దరు లేదా ముగ్గురు) ఒకే యువతిని వివాహం చేసుకోవడం వెనకున్న కారణమని ఈ తెగ పెద్దలు చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లలో హిమాచల్, ఉత్తరాఖండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి వివాహాలు ఆరు జరిగాయని సమాచారం. కాగా, కొన్ని ఆఫ్రికా దేశాల్లోనూ ఈ బహుభర్తృత్వం కొనసాగుతోంది.