వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై విడదల రజని స్పందన

  • ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి అరెస్ట్
  • రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందన్న విడదల రజని
  • లేని లిక్కర్ కేసును సృష్టించారని విమర్శలు
  • అధికారం శాశ్వతం కాదంటూ ట్వీట్
ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజని తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదని, అరాచక పాలన అని అభివర్ణించారు. అధికారం ఉంది కదా అని, లేని లిక్కర్ కేసును సృష్టించి వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. "మా ఎంపీ మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నా. చంద్రబాబు గారూ... అధికారం శాశ్వతం కాదన్నది గుర్తుపెట్టుకోండి" అంటూ రజని ట్వీట్ చేశారు. 

అటు ఫేస్ బుక్ లోనూ "వుయ్ స్టాండ్ విత్ మిథున్ అన్న" అంటూ ఆమె పోస్ట్ చేశారు.


More Telugu News