నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబు: శైలజానాథ్

  • హద్రీనీవాపై చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న శైలజానాథ్
  • హంద్రీనీవాకు చంద్రబాబు రెండుసార్లు శంకుస్థాపన చేశారని ఎద్దేవా
  • చంద్రబాబు పాలన మొత్తం గ్రాఫిక్స్ మయమని విమర్శ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు రెండుసార్లు శంకుస్థాపన చేసిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని అన్నారు. 

40 టీఎంసీల హంద్రానీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. వైఎస్ హయాంలో హంద్రీనీవా పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగిన విషయాన్ని తెలుసుకోవాలని చెప్పారు. హంద్రీనీవాను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు.

చంద్రబాబు అబద్ధాలు తారాస్థాయికి చేరాయని అన్నారు. రాబోయే రోజుల్లో భారత్ ను, ఐరోపాను తానే కనిపెట్టానని చంద్రబాబు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన మొత్తం గ్రాఫిక్స్ మయమని అన్నారు.


More Telugu News