ఐఐటీ ఖరగ్ పూర్ లో మరో విద్యార్థి ఆత్మహత్య... ఈ ఏడాది నాలుగో ఘటన!

  • బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న రిథమ్ మోండల్ ఆత్మహత్య
  • ఈ ఏడాది జనవరి నుంచి ఇది నాలుగో ఆత్మహత్య
  • మృతి చెందిన విద్యార్థిది కోల్ కతా
ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ ఖరగ్ పూర్ లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రిథమ్ మోండల్ అనే విద్యార్థి తన రూమ్ లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మృతి చెందిన విద్యార్థి కోల్ కతాకు చెందినవాడు. ఆత్మహత్యకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేశారు.

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ ఐఐటీలో ఇది నాలుగో ఆత్మహత్య కావడం గమనార్హం. జనవరి 12న ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న షాన్ మాలిక్, ఏప్రిల్ 4న ఓషన్ ఇంజినీరింగ్ చదువుతున్న అనికేత్ వాకర్, మే 4న మహమ్మద్ ఖమన్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు.


More Telugu News