Donald Trump: ఐదు ఫైటర్ జెట్లు కూలిపోయాయి.. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ మరోమారు వ్యాఖ్యలు

Donald Trump Comments on Operation Sindoor Five Jets Crashed
  • వైట్‌హౌస్‌లో రిపబ్లికన్ చట్టసభ్యులకు ట్రంప్ ప్రైవేటు విందు
  • ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌పై ప్రస్తావన
  • ఐదు జెట్లను ఆకాశంలోనే పేల్చేశారన్న అధ్యక్షుడు
  • అవి ఏ దేశానివో స్పష్టంగా చెప్పని వైనం
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు స్పందించారు. ఈ ఘర్షణలో ‘ఐదు జెట్లు కూలిపోయాయని’ పేర్కొన్నారు. అమెరికా శ్వేతసౌధంలో రిపబ్లికన్ చట్ట సభ్యులకు ఇచ్చిన ప్రైవేటు విందులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఏ దేశానికి చెందిన జెట్లు కూలిపోయాయన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. 

‘‘నిజానికి విమానాలను ఆకాశంలోనే పేల్చేశారు. ఐదు, ఐదు, నాలుగు లేదంటే ఐదు జెట్లు.. ఐదు జెట్లు అనే అనుకుంటున్నాను. వాటిని పేల్చేశారు’’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. భారత్‌తో జరిగిన ఘర్షణలో ఆ దేశానికి చెందిన జెట్లను కూల్చివేశామని పాకిస్థాన్ పదేపదే చెబుతోంది. ఇందులో మూడు రఫేల్ యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు, భారత పైలట్లను కూడా పట్టుకున్నామని చెప్పింది. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది. 

పాక్ ఆరోపణలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంది. అయితే, భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన విమానాలను భారత్ కోల్పోయిందని ఇటీవల సీడీఎస్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. అయితే, ఆరు విమానాలను తాము ధ్వంసం చేశామన్న పాక్ కథనాన్ని ఆయన తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
Donald Trump
Operation Sindoor
Pahalgam Terrorist Attack
India Pakistan Conflict
Fighter Jets
Rafale fighter jets
Indian Air Force
Anil Chauhan
CDS Chief
White House

More Telugu News