TTD: టీటీడీలో నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్
- క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని నిర్ధారణ కావడంతో చర్యలు
- హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం
- నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేసినట్లు టీటీడీ వెల్లడి
నలుగురు అన్యమత ఉద్యోగులను టీటీడీ సస్పెండ్ చేసింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్) ఎలిజర్, బర్డ్ ఆసుపత్రి స్టాప్ నర్స్ రోసి, గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ ఎం.ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న డా. జి.అసుంతను టీటీడీ సస్పెండ్ చేసింది. వీరు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకుంది.
టీటీడీ ఉద్యోగులుగా పనిచేస్తూ సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని, హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని తెలిపింది. విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేసినట్లు టీటీడీ పేర్కొంది.