బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: డీకే అరుణ

  • గోదావరిలో మిగులు జలాలు లేవని నిపుణులు చెబుతున్నారన్న డీకే అరుణ
  • మిగులు జలాలపై స్పష్టత రావాల్సి ఉందని వ్యాఖ్య
  • బనకచర్లపై చర్చ జరగాల్సిన అవసరముందన్న బీజేపీ ఎంపీ
గోదావరి నదిలో మిగులు జలాలు లేవని నిపుణులు చెబుతున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఒకవేళ మిగులు జలాలు ఉంటే... ఎన్ని ఉన్నాయి? వాటిని ఏపీకి తీసుకెళ్లే అవకాశం ఉందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల సమావేశాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. 

ఏపీ నిర్మించాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టుపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అరుణ చెప్పారు. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరగనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టెలీ మీటర్లు కొత్తేం కాదని... వీటిపై గతంలో కూడా చర్చ జరిగిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు.


More Telugu News