తెలంగాణ సెంటిమెంట్ ఎగిరిపోయింది: సీపీఐ నారాయణ
- తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర ప్రభుత్వ సమావేశాన్ని స్వాగతిస్తున్నామన్న నారాయణ
- తెలంగాణకు రేవంత్ అన్యాయం చేయడం లేదని వ్యాఖ్య
- బనకచర్లపై తొలుత మాట్లాడింది తానేనన్న నారాయణ
రేవంత్ రెడ్డి ప్రజలచేత ఎన్నుకోబడిన నేత అని... నామినేట్ చేయబడిన వ్యక్తి కాదని నారాయణ చెప్పారు. పొట్టివాడు గట్టివాడు అని కితాబునిచ్చారు. తెలంగాణకు రేవంత్ ఎలాంటి అన్యాయం చేయలేదని అన్నారు. రేవంత్ ను విమర్శిస్తూ రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదని చెప్పారు. నీళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం... తల్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం వంటిదేనని అన్నారు.
బనకచర్లపై తొలుత మాట్లాడింది తానేనని నారాయణ చెప్పారు. ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు కొంచెం అతిగా మాట్లాడారని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండానే బనకచర్లను తెరపైకి తెచ్చారని అన్నారు. తొలుత పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సూచించారు. బనకచర్ల ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు కాదని అన్నారు. ఇది రూ. 80 వేల కోట్ల ప్రాజెక్టు కాదని... రూ. 2 లక్షల కోట్లు అవుతుందని చెప్పారు. రెండు రాష్ట్రాలు వివాద రహితంగా ప్రాజెక్టులు కట్టుకోవాలని హితవు పలికారు.