అక్కలాంటి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటి?: భానుప్రకాశ్ పై లక్ష్మీపార్వతి ఆగ్రహం

  • రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గాలి భానుప్రకాశ్
  • మీ నాన్న ఎంతో నీతిగా బతికారన్న లక్ష్మీపార్వతి
  • మనిషిగా పుట్టినవాడు సంస్కారంతో ఉండాలని హితవు
మాజీ మంత్రి రోజా వ్యాంప్ కు ఎక్కువ హీరోయిన్ కు తక్కువ అంటూ నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టిస్తున్నాయి. రూ. 2 వేలు ఇస్తే రోజా ఏమైనా చేసేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. 

మీ నాన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎంతో నీతిగా బతికారని... ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని... అలాంటి వ్యక్తికి మచ్చ తీసుకొస్తున్నావని అన్నారు. మనిషిగా పుట్టినవాడు సంస్కారవంతంగా ఉండాలని... అక్కలాంటి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడమేమిటని ప్రశ్నించారు. 

ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మంత్రి పదవి వస్తుందేమోనని ఆశపడుతున్నావేమో...  సమాజంలో నీ విలువ పోతుందని అన్నారు. అక్రమ పనులు, అక్రమ సంపాదన చేస్తున్నావని... ఏదో ఒకరోజు ఇవన్నీ నిన్ను ముంచేస్తాయని హెచ్చరించారు.


More Telugu News