Hyderabad Boxing Competition: హైదరాబాద్‌లో బాక్సింగ్ పోటీల్లో ఉద్రిక్తత.. బాక్సర్లు, కోచ్‌ల ఘర్షణ

హైదరాబాద్ నగరంలోని షేక్‌పేటలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు గురువారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. పోటీల మధ్యలో బాక్సర్లు, కోచ్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు బాక్సర్ల మధ్య బౌట్ జరుగుతున్న సమయంలో ఈ వివాదం తలెత్తింది.

రిఫరీ తప్పుడు నిర్ణయం కారణంగానే తాను ఓటమి పాలయ్యానంటూ ఒక బాక్సర్ వర్గం అతడిపై దాడికి పాల్పడింది. ఈ ఘర్షణలో తలుపులు, కిటికీలు ధ్వంసం అయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి.
Hyderabad Boxing Competition
Telangana Boxing
Boxing Match Dispute

More Telugu News