వరుసగా 8వ సారి క్లీన్ సిటీగా నిలిచిన ఇండోర్.. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అందజేత
- ఢిల్లీలో విజేతలకు అవార్డులను అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- రెండో స్వచ్ఛమైన నగరంగా సూరత్, మూడో స్థానంలో ముంబయి మహా నగరం
- స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపీలోని ఐదు నగరాలకు చోటు
దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ సిటీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో ఇండోర్ వరుసగా ఎనిమిదో ఏడాది భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా అవార్డు అందుకుంది. ఇక, రెండో స్వచ్ఛమైన నగరంగా సూరత్, మూడో స్థానంలో ముంబయి మహా నగరం నిలిచింది.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల విజేతలను మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన వేడుకల్లో ‘స్వచ్ఛ’ జాబితాలో నిలిచిన నగరాలకు అవార్డులను ప్రదానం చేశారు.
కేంద్రం ప్రకటించిన ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపీలోని ఐదు నగరాలకు చోటు దక్కింది. విశాఖపట్నం జాతీయస్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు దక్కించుకుంది. రాజమండ్రికి రాష్ట్రస్థాయిలో మినిస్టీరియల్ అవార్డు లభించింది. స్వచ్ఛ సూపర్‌లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, తిరుపతి, గుంటూరు ఎంపికయ్యాయి.