150 దేశాలపై 10 లేదా 15 శాతం సుంకాలు: ట్రంప్‌

  • ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న ట్రంప్‌
  • తాజాగా మరోసారి సంచలన నిర్ణయం 
  • 150కిపైగా దేశాలపై 10 లేదా 15 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్ల‌డి
  • ఈ మేర‌కు బుధవారం వైట్ హౌస్‌లో విలేకరులతో చెప్పిన ట్రంప్
ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 150కిపైగా దేశాలపై 10 లేదా 15 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయా దేశాలకు సుంకాల రేట్లు తెలియజేస్తూ లేఖలు పంపనున్నట్లు వెల్లడించారు. 

150కిపైగా దేశాలకు నోటీసులు పంపించనున్నామని, అందులోనే సుంకం రేటు పేర్కొంటామని చెప్పారు. ఈ దేశాలన్నింటికీ ఒకే విధంగా సుంకాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. అవన్నీ పెద్ద దేశాలు కాదని, తమతో అంతగా వ్యాపారం చేయవని పేర్కొన్నారు. ఈ సుంకాలు 10 లేదా 15 శాతం ఉంటే అవకాశం ఉందని చెప్పారు.

"మేము 150 కి పైగా దేశాలకు చెల్లింపు నోటీసు పంపబోతున్నాము. చెల్లింపు నోటీసు సుంకం రేటు ఏమిటో తెలియజేస్తుంది. ఆ లేఖలను అందుకునే వాణిజ్య భాగస్వాములు. పెద్ద దేశాలు కావు. వారు అంత వ్యాపారం చేయరు" అని ట్రంప్ బుధవారం వైట్ హౌస్‌లో విలేకరులతో అన్నారు. 

రియల్ అమెరికాస్ వాయిస్ బ్రాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ రేటు బహుశా 10 లేదా 15 శాతం ఉంటుంద‌ని, తాము ఇంకా నిర్ణయించలేద‌ని అన్నారు.


More Telugu News