రాష్ట్రపతి భవన్‌లో మంచు విష్ణు 'కన్నప్ప' చిత్ర ప్రత్యేక ప్రదర్శన

  • మంచు విష్ణు నటనను కొనియాడిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు
  • ప్రత్యేక ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేసిన చిత్ర బృందం
  • భక్తి కథ, సాంస్కృతిక ప్రాముఖ్యానికి దక్కిన గుర్తింపు అన్న చిత్ర బృందం
మంచు విష్ణు నటించిన భక్తిరస చిత్రం 'కన్నప్ప' ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను వీక్షించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు విష్ణు నటనను ప్రశంసించారు. ఈ ప్రత్యేక ప్రదర్శన పట్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తి కథాంశం, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఈ చిత్రానికి లభించిన గుర్తింపు తమకు గర్వకారణమని వారు పేర్కొన్నారు.

శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 27న విడుదలైంది. ముకేశ్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు. విష్ణు నటన, ఎమోషన్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్, శివపార్వతులుగా అక్షయ్ కుమార్ - కాజల్, కిరాతుడిగా మోహన్ లాల్ తమ నటనతో అలరించారు.


More Telugu News