Rana Daggubati: 'బాహుబ‌లి' ర‌న్‌టైమ్‌పై పుకార్లు.. రానా ఏమ‌న్నారంటే..!

Rana Daggubati Responds to Baahubali The Epic Runtime Rumors
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచ సినిమా హిస్ట‌రీలో తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాలకు చేర్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బాహుబలి’ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ అపురూప ఘట్టాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ఇటీవ‌ల ఒక కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ చిత్రాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే భాగంగా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 31న ఈ విజువల్ వండర్ మరోసారి వెండితెరపై కనువిందు చేయనుంది.

ఇక‌, ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన త‌ర్వాత నుంచి ఈ మూవీ ర‌న్‌టైమ్ విష‌యంలో ర‌క‌ర‌కాల రూమ‌ర్స్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీని నిడివి ఐదు గంట‌ల‌కు పైగానే ఉంటుంద‌ని కొంద‌రు, 4 గంట‌లు అని మ‌రికొంద‌రు పోస్టులు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా న‌టుడు రానా స్పందించారు. ఈ సినిమాలో భ‌ల్లాల దేవ పాత్ర‌లో రానా అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. 

‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ర‌న్‌టైమ్ పుకార్ల‌పై ఆయ‌న స్పందిస్తూ... "ఎంత నిడివి ఉన్నా నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఏడాదిలో నేను ఏ మూవీలో న‌టించ‌కుండానే నాకు బ్లాక్‌బ‌స్ట‌ర్ రానుంది. ర‌న్‌టైమ్ ఎంత అనే విష‌యం నాకు కూడా తెలియ‌దు. 4 గంట‌లు అని పోస్టులు పెడుతున్నారు. 

అంత నిడివి ఉంటే చూస్తారా! సినిమా ర‌న్‌టైమ్ కేవ‌లం జ‌క్క‌న్న‌కు మాత్ర‌మే తెలుసు. ఆయ‌న చెప్పేవ‌ర‌కూ ఎవ‌రికీ తెలియ‌దు. నాకైతే ఆయ‌న ఏం చెప్ప‌లేదు" అని రానా అన్నారు. దీంతో ఈ మూవీ ర‌న్‌టైమ్ చ‌ర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.  
Go Back to Shorts
Rana Daggubati
Baahubali The Epic
Baahubali
SS Rajamouli
Prabhas
Baahubali runtime
Telugu cinema
Bhalla Deva
Indian movies
box office hit

More Telugu News