Teenmaar Mallanna: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ తీన్మార్ మల్లన్నకు సిట్ నోటీసులు

Teenmaar Mallanna to Attend SIT Investigation in Phone Tapping Case
  • విచారణను ముమ్మరం చేసిన సిట్
  • తీన్మార్ మల్లన్న ఫోన్ ట్యాప్ అయినట్టు గుర్తించిన అధికారులు
  • విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలంటూ నోటీసులిచ్చిన సిట్
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరమయింది. విచారణ కొనసాగుతున్న కొద్దీ బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 269 మంది బాధితుల వాంగ్మూలాలను సిట్ అధికారులు నమోదు చేసినట్టు సమాచారం. బాధితుల్లో అన్ని పార్టీల నేతలు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, సినీ, మీడియా, ఫార్మా, ఐటీ ప్రముఖులు ఉన్నారు. దాదాపు 4,200కు పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు. 

ఈ క్రమంలో, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో, విచారణకు హాజరై, వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సిట్ నోటీసులు అందజేసింది. ఈ నేపథ్యంలో రేపు ఆయన జూబ్లీహిల్స్ పీఎస్ కు వెళ్లి స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. 
Teenmaar Mallanna
Chintapandu Naveen
Telangana phone tapping case
SIT investigation
Phone tapping scandal
Telangana politics
Jubilee Hills PS
MLC Teenmaar Mallanna
Telangana government

More Telugu News