కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకో.. తిరిగి జ‌ట్టులోకి రా: మదన్ లాల్

  • లార్డ్స్ టెస్టులో పోరాడి ఓడిన భార‌త్‌
  • ఈ ఓట‌మి త‌ర్వాత కోహ్లీకి మ‌ద‌న్ లాల్ కీల‌క అభ్య‌ర్థ‌న‌
  • రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకోవడంలో తప్పు లేదన్న మాజీ క్రికెట‌ర్‌
  • కోహ్లీ తన అనుభవాలను యువకులతో పంచుకోవాలని సూచ‌న‌
లార్డ్స్ వేదిక‌గా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా పోరాడి ఓడిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ ఓటమి తర్వాత భారత క్రికెట్ జట్టు మాజీ ఆట‌గాడు మదన్ లాల్.. విరాట్ కోహ్లీని కీల‌క అభ్య‌ర్థ‌న చేశాడు. త‌న టెస్ట్‌ రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని కోరారు. విరాట్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవడంలో తప్పు లేదని, తన అనుభవాలను, క్రీడ పట్ల తన మక్కువను యువకులతో పంచుకోవాలని మదన్ లాల్ తెలిపాడు.

"భారత క్రికెట్ పట్ల విరాట్ కోహ్లీకి ఉన్న మక్కువ అసమానమైంది. రిటైర్మెంట్ తర్వాత అతను టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి రావాలని నా కోరిక. తిరిగి రావడంలో తప్పు లేదు. ఈ సిరీస్‌లో కాకపోయినా తదుపరి సిరీస్‌లో అతను తిరిగి రావాలి.

నా దృష్టిలో అతను తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే అతను మ‌రో 1-2 సంవత్సరాలు సులభంగా ఆడగలడు. ఇది విరాట్ త‌న‌ అనుభవాన్ని యువకులకు అందించడంలో స‌హాయ‌ప‌డుతుంది. ఇంకా ఆలస్యం కాలేదు. దయచేసి తిరిగి రండి" అని మదన్ లాల్ క్రికెట్ ప్రిడిక్టాతో అన్నాడు.


More Telugu News