అంతరిక్షం నుంచి కాలిఫోర్నియాలో ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా! (వీడియో ఇదిగో)
- శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములతో కూడిన వ్యోమనౌక
- 22 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భూమిపైకి చేరిన నౌక
- ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు వ్యోమగాములు
భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. వీరు అంతరిక్షంలో 18 రోజులు గడిపిన అనంతరం 22 గంటల సుదీర్ఘ ప్రయాణం చేసి భూమిపై దిగారు.
కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో నలుగురు వ్యోమగాములతో కూడిన వ్యోమనౌక దిగింది. వారిని ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించనున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు వారు భూమిని చేరారు.
జూన్ 25న అంతరిక్షంలోకి వెళ్లిన శుభాంశు బృందం అక్కడ పలు కీలక పరిశోధనలు నిర్వహించింది. ఈ 18 రోజుల్లో వీరు దాదాపు 96.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. శుభాంశు శుక్లా 60కి పైగా శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొన్నారు. అంతరిక్షంలో ఉన్న సమయంలో ఈ బృందం 230 సూర్యోదయాలను చూసింది.