నేను ప్రమాణం చేస్తా... పేర్ని నాని కూడా చేస్తారా?: మంత్రి కొల్లు రవీంద్ర

  • పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
  • తానే ఇసుక అక్రమాలకు పాల్పడలేదని స్పష్టీకరణ
  • మంత్రిగా ఉన్నప్పుడు పేర్ని నాని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై కూటమి మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో పేర్ని నాని రవాణా శాఖ మంత్రిగా, కొడాలి నాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అమాయకుల పేర్ల మీద కోట్ల రూపాయలు దండుకున్నారని అన్నారు. పైగా నేను ఇసుక అక్రమాలకు పాల్పడ్డానంటూ ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మరి పేర్ని నాని కూడా ప్రమాణం చేసేందుకు సిద్ధమేనా అని కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. 

చివరికి కులాల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి పేర్ని నాని దిగజారారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు దొంగ పట్టాలు పంపిణీ చేసింది ఎవరు? అని నిలదీశారు. పేర్ని నాని బందరుకే కాదు... మన రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు అంటూ ఎద్దేవా చేశారు. 


More Telugu News