ఓటీటీ ట్రాక్ పైకి తమిళ థ్రిల్లర్

Manidhargal Movie Update
తమిళం నుంచి ఇటీవల థియేటర్లకు 'మనిదర్గళ్' అనే థ్రిల్లర్ సినిమా వచ్చింది. పోస్టర్స్ దగ్గర నుంచే అందరిలోను ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించింది. దాంతో రిలీజ్ కి ముందు మంచి బజ్ వచ్చింది. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా, ఒక కొత్త ప్రయత్నం అనిపించుకుంది. మే 30వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి, రామ్ ఇంద్ర దర్శకత్వం వహించాడు. 

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమాను 'ఆహా తమిళ్'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కపిల్ వేలవన్ .. దశ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, గుణవంతన్ .. అర్జున్ దేవ్ .. శరవణన్ .. సాంబశివన్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

 కథ విషయానికి వస్తే .. ఆరుగురు స్నేహితులు ఆనందంగా పార్టీ చేసుకుంటారు. అందరూ కూడా విపరీతంగా తాగేస్తారు. రాత్రివేళలో బయల్దేరతారు. మార్గ మధ్యంలో ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ సంఘటనతో వాళ్ల జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావొచ్చని మేకర్స్ భావిస్తున్నారు. 




Go Back to Shorts
Manidhargal
Manidhargal movie
Tamil thriller movie
Aha Tamil
Kapil Velavan
Ram Indra
OTT release
Tamil cinema
Gunavanthan
Arjun Dev

More Telugu News