రేపటి నుంచి చంద్రబాబు ఢిల్లీ పర్యటన... షెడ్యూల్ ఇదిగో!

  • రెండ్రోజుల పాటు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
  • హస్తినలో కేంద్రమంత్రులతో చంద్రబాబు కీలక సమావేశాలు
  • పలు కార్యక్రమాలతో చంద్రబాబు ఫుల్ బిజీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దేశ రాజధానిలో ఆయన రెండు రోజుల (జులై 15, 16) పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొని, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

పర్యటన వివరాలు...

  • జులై 15 (మంగళవారం) 
    • ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11:45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.  
    • మధ్యాహ్నం 1:00 గంటకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం.  
    • మధ్యాహ్నం 2:30 గంటలకు 1-జన్‌పథ్‌లో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్‌తో భేటీ.  
    • మధ్యాహ్నం 3:00 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీతో సమావేశం. ఈ సమావేశంలో రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చ జరుగనుంది.  
    • మధ్యాహ్నం 3:30 గంటలకు మూర్తి మార్గ్-3లో జరిగే పీవీ నర్సింహారావు సంస్మరణ సభలో ప్రసంగం.  
    • రాత్రి 7:00 గంటలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం.
  • జులై 16 (బుధవారం)  
    • ఉదయం 10:00 గంటలకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్షుక్ ఎల్ మాండవీయతో భేటీ.  
    • మధ్యాహ్నం 2:30 గంటలకు జలశక్తి భవన్‌లో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం.  
    • సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ.  
    • రాత్రికి ఢిల్లీలోనే బస చేసి, జులై 17 (గురువారం) ఉదయం 9:30 గంటలకు అమరావతికి తిరుగు ప్రయాణం.

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించి, అవసరమైన నిధులు, ప్రాజెక్టులకు మద్దతు కోరనున్నారు.


More Telugu News