అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!
- గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియామకం
- రాష్ట్రపతి ఆమోదముద్ర
- అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అశోక్ గజపతిరాజు, గవర్నర్‌గా రాజ్యాంగ బాధ్యతలను నిష్ఠగా నిర్వహిస్తూ పదవికి వన్నె తెస్తారని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. "టీడీపీ సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజు గారు గోవా గవర్నర్‌గా ఎంపిక కావడం సంతోషకరం. ఆయన తమ అనుభవంతో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలను నిర్వహించి, పదవికి కీర్తి తెస్తారని ఆశిస్తున్నాను" అని పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
అశోక్ గజపతిరాజు రాజకీయ జీవితంలో విశేష సేవలు అందించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన గవర్నర్‌గా నియామకం కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆనందాన్ని నింపింది.