తిరుపతి రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం... రాయలసీమ, షిరిడి ఎక్స్ ప్రెస్ రైళ్లలో మంటలు!
- లూప్ లైన్ లో ఉన్న రైళ్లలో ఒక్కసారిగా మంటలు
- రెండు బోగీలు దగ్ధం
- భయాందోళనలకు గురైన ప్రయాణికులు
ఈ అగ్నిప్రమాదంతో తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. రైల్వే అధికారులు ప్రమాద కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.