సమయం, సందర్భం ఉండక్కర్లా!... రాజమౌళికి కోపం తెప్పించిన అభిమాని!

  • నేడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
  • కోట భౌతికకాయానికి నివాళులు అర్పించిన రాజమౌళి దంపతులు
  • రాజమౌళితో సెల్ఫీకి యత్నించిన అభిమాని... తోసేసిన రాజమౌళి!
ఇవాళ ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన రాజమౌళిని ఓ అభిమాని విసిగించాడు. దాంతో రాజమౌళికి చిర్రెత్తుకొచ్చి అతడిని నెట్టివేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కోట నివాసానికి రాజమౌళి తన అర్ధాంగి రమా రాజమౌళితో కలిసి వచ్చారు. కోట భౌతికకాయానికి నివాళులు అర్పించి తిరిగి వెళ్లే సమయంలో ఓ అభిమాని రాజమౌళితో సెల్ఫీ దిగేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. దాంతో రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ అభిమానిని పక్కకు తోసేశారు. అనంతరం కారులో ఎక్కి అక్కడ్నించి వెళ్లిపోయారు. 


More Telugu News