"ప్రభాస్ చాలా ఓపెన్" అంటున్న కన్నప్ప హీరోయిన్

  • కన్నప్ప చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రీతి ముకుందన్
  • కన్నప్ప చిత్రంలో రుద్రుడిగా ప్రభాస్
  • ప్రభాస్ తో షూటింగ్ అనుభవాలను పంచుకున్న నటి
టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నటి ప్రీతి ముకుందన్. ప్రీతి ముకుందన్ 'కన్నప్ప' చిత్రంలో నాయికగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్‌తో తనకున్న అనుభవాన్ని పంచుకుంటూ ఆయన వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించింది ప్రీతి.
ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ, "ప్రభాస్ గారితో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆయనకు చాలా బలమైన వ్యక్తిత్వం ఉంది. ఆయన చుట్టూ ఒక ప్రత్యేకమైన 'ఆరా' ఉంటుంది. అయితే ఆశ్చర్యకరంగా, ఆయన ఎప్పుడూ ఎవరినీ చిన్నగా చూడరు. సెట్‌లో అందరితో చాలా స్నేహంగా, గౌరవంగా ఉంటారు. ఆయన తన స్టార్‌డమ్‌ను ఎప్పుడూ ప్రదర్శించరు. ఒక సాధారణ వ్యక్తిలా మాతో కలిసిపోయేవారు" అని తెలిపింది.

ఆమె ఇంకా మాట్లాడుతూ, "ప్రభాస్ గారితో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ భయంగా అనిపించలేదు. ఆయన చాలా ఓపెన్‌గా ఉంటారు. ఎవరి సందేహాలనైనా తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన సెట్‌లో ఉన్నప్పుడు ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఆయన సహనానికి, మంచితనానికి నేను ముగ్ధురాలైపోయాను" అని వివరించింది. 


More Telugu News