ఉద్రిక్తతల కోసం కాదు.. శాంతి కోసమే: పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్

  • అణు కార్యక్రమంపై ఆందోళనలను తోసిపుచ్చిన పాక్ ప్రధాని
  • దేశ రక్షణ, శాంతియుత ప్రయోజనాల కోసమేనని వెల్లడి
  • ఇస్లామాబాద్ లో విద్యార్థులతో షరీఫ్ ముఖాముఖి
పాకిస్థాన్‌ అణు కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దేశ రక్షణ కోసమే అణు సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఇస్లామాబాద్ లో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ తో ఇటీవలి ఉద్రిక్తతలు అణు ఘర్షణలకు దారితీయొచ్చనే ఆందోళనలను షరీఫ్ తోసిపుచ్చారు.

భారత్‌ తో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో 55 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసీమ్‌ మునీర్ పై వచ్చిన ఆరోపణలపైనా షరీఫ్ స్పందించారు. పాక్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీని బలవంతంగా దించేసి మునీర్‌ ఆ స్థానాన్ని ఆక్రమించనున్నారంటూ వస్తున్న వార్తలను షరీఫ్‌ తోసిపుచ్చారు. దేశాధ్యక్షుడు కావాలన్న ఆకాంక్షను మునీర్ ఎప్పుడూ వ్యక్తపరచలేదని షరీఫ్ స్పష్టం చేశారు.


More Telugu News