రాధికా యాదవ్ హత్య.. నన్ను ఉరితీయండంటూ తండ్రి పశ్చాత్తాపం!

Radhika Yadav Murder Father Expresses Remorse
షార్ట్స్‌లో చూడండి
హర్యానా రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్‌‍‌ను హత్య చేసిన తండ్రి దీపక్ యాదవ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. రాధిక హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆవేశంలో హత్య చేసిన దీపక్ ఇప్పుడు కుమిలిపోతున్నాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ మేరకు దీపక్ సోదరుడు విజయ్ మీడియాతో మాట్లాడుతూ, "హత్య చేయడం చాలా పెద్ద తప్పిదం. దీపక్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లినప్పుడు నేను వెంట ఉన్నాను. ఆ సమయంలో అతడు పశ్చాత్తాపంతో ఉన్నాడు. నన్ను ఉరితీసే విధంగా ఎఫ్ఐఆర్ రాయండని కూడా పోలీసులకు చెప్పాడు. ఆడపిల్లను చంపేశానని రోదించాడు" అని వెల్లడించాడు.

ప్రస్తుతం దీపక్ రెండు వారాల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. రాధికను తండ్రి దీపక్ హత్య చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. తన సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతో తండ్రి హత్య చేసినట్లుగా మొదట వార్తలు వచ్చాయి. అయితే ఆ కుటుంబంతో పరిచయం ఉన్న వారు మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు. రాధిక గత ఏడాది ఒక కళాకారుడితో కలిసి రీల్స్ చేసింది. ఇది వారి కుటుంబంలో చిచ్చు పెట్టినట్లుగా మరో కథనం ఉంది.
Go Back to Shorts
Radhika Yadav
Haryana tennis player
Deepak Yadav
Radhika Yadav murder
crime news

More Telugu News