బస్సు నడిపిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి! (ఇదిగో వీడియో)
- నల్గొండ బస్ స్టేషన్‌లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రులు
- బస్సు నడిపి అందరినీ ఉత్సాహపరిచిన మంత్రి
- బస్సులో కూర్చున్న మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా బస్సు నడిపారు. ఈరోజు నల్గొండ బస్ స్టేషన్‌లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కలిసి 40 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి స్వయంగా బస్సు నడిపి అందరిలో ఉత్సాహం నింపారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డ్రైవర్ సీటులో కూర్చొని కొంత దూరం బస్సు నడపగా, మంత్రి పొన్నం ప్రభాకర్, వేముల వీరేశం, మరికొందరు నాయకులు అందులో ప్రయాణించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బస్సు నడుపుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.