Shubhanshu Shukla: భూమికి తిరిగి వచ్చాక వారం రోజులు క్వారంటైన్‌కు శుభాంశు శుక్లా

Shubhanshu Shukla to Quarantine for a Week After Returning to Earth
  • ఈ నెల 14న భూమికి తిరిగి రానున్న శుక్లా సహా వ్యోమగాములు
  • కాలిఫోర్నియాలో ల్యాండ్ కాగానే క్వారంటైన్‌కు తరలింపు
  • వారం రోజుల పాటు వారి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించనున్న ఇస్రో వైద్యులు
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భూమికి తిరిగి వచ్చిన అనంతరం వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన శుభాంశు శుక్లా, ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఈ నెల 14న భూమికి తిరిగి రానున్నారు. జులై 15న కాలిఫోర్నియా తీరంలో వారు ల్యాండ్ కాగానే వారిని ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.

వ్యోమగాములు అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించినందున భూవాతావరణానికి వారి శరీరాలు అలవాటు పడేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వారం రోజుల పాటు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా, అంతరిక్షంలో వ్యోమగాముల శరీరాలపై పడిన ప్రభావాన్ని కూడా వైద్యాధికారులు అధ్యయనం చేయనున్నారు.
Shubhanshu Shukla
Indian astronaut
ISS
International Space Station
quarantine
space mission

More Telugu News