లార్డ్స్ లో టీమిండియా, ఇంగ్లండ్ ఆటగాళ్ల లంచ్ మెనూ చూశారా...!
- లార్డ్స్ లో భారత్, ఇంగ్లండ్ టెస్టు
- నేడు ఆటకు రెండో రోజు
- లంచ్ మెనూ కార్డును సోషల్ మీడియాలో పంచుకున్న లార్డ్స్ నిర్వాహకులు
లార్డ్స్ లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జరుగుతోంది. కాగా, రెండో రోజు ఆటకు సంబంధించిన ఆటగాళ్ల లంచ్ మెనూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మెనూ కార్డును లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ తన అఫిషియల్ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. డే-2 మెనూ... అంటూ నోరూరించే వంటకాలను ఆటగాళ్లకు అందుబాటులో ఉంచినట్టు ఈ మెనూ చూస్తే అర్థమవుతోంది. చికెన్ మీట్ బాల్స్, కాడ్ చేపలు, రొయ్యలు, గొర్రె పిల్ల మాంసం, పనీర్ టిక్కా, బాస్మతి రైస్ వంటి మల్టీ క్యూజిన్ వంటకాలను ఇందులో చూడొచ్చు.
- బటర్ నట్ స్క్వాష్ సూప్
- హ్యారిస్సా మ్యారినేటెడ్ చికెన్ మీట్ బాల్స్
- మిసో మ్యారినేటెడ్ కాడ్ లోయిన్
- లాంబ్ రైల్వే కర్రీ
- పంప్కిన్ కుర్మా
- పీ అండ్ మింట్ టార్టెల్లిని
- పనీర్ టిక్కా
- రొయ్యలు/మేరీ రోజ్ సాస్
- బాస్మతి రైస్
- క్రష్డ్ న్యూ పొటాటోస్
- క్యారట్స్, ఫ్రెంచ్ బీన్స్, బ్రాకోలి
- ఫ్రూట్ సలాడ్
- గ్రీక్ యోగర్ట్