పంత్ గాయంపై అప్ డేట్ ఇచ్చిన బీసీసీఐ!
- లార్డ్స్ లో భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు
- తొలి రోజు ఆటలో గాయపడిన పంత్
- ఎడమ చేతి చూపుడు వేలికి తగిలిన బంతి
- మైదానం వీడిన పంత్... వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్
భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో గాయపడిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆటలో వికెట్ కీపింగ్ చేస్తుండగా పంత్ వేలికి గాయమైంది. ఎడమ చేతి చూపుడు వేలుకు బంతి బలంగా తగలడంతో గాయపడ్డాడు. దాంతో అతను మైదానం వీడగా, అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు అందుకున్నాడు.
ఈ నేపథ్యంలో, పంత్ గాయంపై బీసీసీఐ అప్ డేట్ ఇచ్చింది. అతను ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని వెల్లడించింది. మైదానంలో వైద్య సిబ్బంది చికిత్స అందించినా పంత్ కోలుకోకపోవడంతో రెండో రోజు ఆట మొదలయ్యే సమయానికి అతడు బరిలోకి దిగలేదని తెలిపింది. పంత్ గాయం తీవ్రత దృష్ట్యా అతడు రెండో రోజు ఆటలో ఆడటం కుదరలేదని, అతడి స్థానంలో జురెల్ కీపింగ్ బాధ్యతలు కొనసాగిస్తాడని పేర్కొంది.
ఒకవేళ పంత్ గాయం తీవ్రమైతే అతడు సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. దీనిపై బీసీసీఐ త్వరలోనే పూర్తి స్థాయి ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు.