Allu Arjun: విశాఖలో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్... వేగంగా పనులు!

Allu Arjun Multiplex in Vizag Construction Underway
  • విశాఖలో అత్యంత లగ్జరీగా ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్
  • మొత్తం 8 స్క్రీన్లతో నిర్మాణం
  • వచ్చే ఏడాది వేసవి నాటికి ప్రారంభం!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు హైదరాబాదులో మల్టీప్లెక్స్ ఉంది. తాజాగా అల్లు అర్జున్ విశాఖపట్నంలోనూ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. నగరంలోని ఇనార్బిట్ మాల్ లో ఏషియన్ అల్లు అర్జున్ (ఏఏఏ) మల్టీ ప్లెక్స్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో మొత్తం 8 స్క్రీన్లు ఉంటాయి. 

దక్షిణ భారతదేశంలోనే ఇది అత్యంత పెద్ద ఇనార్బిట్ మాల్ కాగా, ఇందులో అల్లు అర్జున్ నిర్మించబోయేది అత్యంత లగ్జరీ థియేటర్ అని తెలుస్తోంది. ఈ మల్టీప్లెక్స్ కు అవసరమైన ఎక్విప్ మెంట్, ఫర్నిచర్ మొత్తం విదేశాల నుంచి తీసుకువస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి నాటికి ఈ మల్టీప్లెక్స్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనులు వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Allu Arjun
AAA Cinemas
Visakhapatnam
Multiplex
Inorbit Mall
Theater Business
Tollywood
Movie Theater
Luxury Theater
South India

More Telugu News