Rajat Bhargava: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్... విచారణకు హాజరైన రజత్ భార్గవ
- సిట్ విచారణకు హాజరైన మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ
- విచారణకు హాజరుకాలేనని ఉదయం సమాచారం పంపిన వైనం
- తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసిన సిట్ అధికారులు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును విచారిస్తున్న సిట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న నాటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ విచారణకు హాజరయ్యారు. తనతో పాటు తన హెల్త్ కండిషన్ కు సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లను వెంట తెచ్చుకున్నారు.
మరోవైపు, ఈనాటి సిట్ విచారణకు హాజరుకాలేనని ఉదయం ఆయన విచారణాధికారులకు సమాచారం పంపించారు. తన ఆరోగ్యం బాగోలేదని తెలిపారు. అయినప్పటికీ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని సిట్ స్పష్టం చేయడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో పలువురిని విచారించి, అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.