లార్డ్స్ టెస్టులో గిల్ స్లెడ్జింగ్ మామూలుగా లేదు!
- ఇంగ్లండ్ బ్యాటర్లపై శుభ్‌మన్ గిల్ వ్యంగ్యాస్త్రాలు
- "బోరింగ్ టెస్ట్ క్రికెట్‌కు స్వాగతం" అంటూ ఎత్తిపొడుపు మాటలు!
- ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి
- నెమ్మదించిన ఇంగ్లండ్ బ్యాటింగ్.. ఆచితూచి ఆడిన రూట్, పోప్
- తొలి రోజు టీ విరామానికి ఇంగ్లండ్ స్కోరు 153/2
- వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు స్వల్ప గాయం
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనలోని మరో కోణాన్ని ప్రదర్శించాడు. బంతితోనే కాకుండా మాటలతోనూ ప్రత్యర్థులను ఎలా దెబ్బకొట్టాలో చూపిస్తూ, మైండ్‌గేమ్‌తో ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడే ఇంగ్లండ్ బ్యాటర్లు రెండో సెషన్‌లో నెమ్మదించడంతో, వారిని ఉద్దేశించి "ఇక ఆసక్తికరమైన క్రికెట్ ఉండదు. బోరింగ్ టెస్ట్ క్రికెట్‌కు తిరిగి స్వాగతం" అంటూ గిల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. గిల్ చేసిన ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి.
గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో గిల్ కెప్టెన్సీ పరంగానూ తనదైన ముద్ర వేశాడు. తొలి సెషన్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు కుదురుకుంటున్న సమయంలో, 14వ ఓవర్లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి బంతినిచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ నితీశ్ తన తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. మొదట బెన్ డకెట్ (23), ఆ తర్వాత జాక్ క్రాలీ (18)ని పెవిలియన్‌కు పంపాడు.
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లంచ్ విరామానికి 83 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్, టీ విరామ సమయానికి మరో వికెట్ నష్టపోకుండా 153 పరుగులు చేసింది. జో రూట్ (54 బ్యాటింగ్), ఓలీ పోప్ (44 బ్యాటింగ్) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రెండో సెషన్‌లో ఇంగ్లండ్ కేవలం 24 ఓవర్లలో 70 పరుగులు మాత్రమే చేసింది.
ఇదిలా ఉండగా, మ్యాచ్ మధ్యలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతివేలికి గాయమవడంతో మైదానం వీడాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు.