విడాకుల వార్తలపై నయనతార స్ట్రాంగ్ కౌంటర్.. భర్తతో ఫొటో షేర్!
- భర్త విఘ్నేశ్‌తో విడిపోతున్నారన్న వార్తలపై స్పందించిన నయనతార
- పుకార్లను ఖండిస్తూ భర్తతో కలిసి దిగిన ఫొటో పోస్ట్
- మాపై వచ్చే సిల్లీ న్యూస్ చూస్తే మా రియాక్షన్ ఇదేనంటూ క్యాప్షన్
ఇటీవల నయనతార తన సామాజిక మాధ్యమ ఖాతాలో వైవాహిక జీవితం గురించి పెట్టిన ఒక పోస్టే ఈ ప్రచారానికి కారణమైంది. "తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఓ పొరపాటు. భర్త చేసిన తప్పులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు" అనే అర్థం వచ్చేలా ఉన్న ఆ పోస్టును ఆమె పంచుకున్నారు.
అయితే, పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే దానిని తొలగించారు. కానీ, అప్పటికే ఆ స్క్రీన్‌షాట్స్ వైరల్ కావడంతో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే నయనతార తాజాగా ఫొటో పోస్ట్ చేసి ఆ వదంతులకు ముగింపు పలికారు.