తమిళనాడులో స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు విద్యార్థుల మృతి

  • కడలూర్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం
  • రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు
  • పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
  • ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
తమిళనాడులోని కడలూర్ సమీపంలో ఈ ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెమ్మన్‌కుప్పం రైల్వే క్రాసింగ్ వద్ద పాఠశాల విద్యార్థులతో వెళుతున్న వ్యాన్‌ను రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

విద్యార్థులతో కూడిన స్కూల్ వ్యాన్ సెమ్మన్‌కుప్పం వద్ద రైల్వే ట్రాక్‌ను దాటుతోంది. అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు వ్యాన్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ నుజ్జునుజ్జయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నంటాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన కడలూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి కచ్చితమైన సంఖ్య తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News