నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతున్న 'పూణె హైవే'

  • హిందీలో రూపొందిన 'పూణె హైవే'
  • మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ 
  • ఈ నెల 4 నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్ 
  • ఆడియన్స్ నుంచి అనూహ్యమైన  రెస్పాన్స్ 

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్లు .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు ఓటీటీలలో ఇప్పుడు విశేషమైన ఆదరణ లభిస్తోంది. అదే విషయాన్ని 'పూణె హైవే' సినిమా మరోసారి నిరూపిస్తోంది. భార్గవ కృష్ణ - రాహుల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 23వ తేదీన థియేటర్లలో విడుదలైంది. థియేటర్ల వైపు నుంచి ఫరవాలేదని అనిపించుకున్న ఈ సినిమా, ఈ నెల 4వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో  దూసుకుపోతోంది.

ముంబైకి చాలా దూరంలోని ఒక చెరువులో ఒక యువతి మృత దేహం లభిస్తుంది. ఆమె పేరు మోనా అని విచారణలో తేలుతుంది. అయితే అది హత్యనా .. ఆత్మహత్యనా అనేది తేల్చడానికి సీఐ ప్రభాకర్ రంగంలోకి దిగుతాడు. అతని ఇన్వెస్టిగేషన్ ఒక నలుగురు వ్యక్తుల దగ్గర ఆగుతుంది. ఆ నలుగురు కూడా మంచి స్నేహితులు. మోన హత్య కేసులో వాళ్లను ఆ పోలీస్ ఆఫీసర్ అనుమానిస్తాడు. 

ఆ నలుగురు స్నేహితులకు నిజంగానే మోనాతో సంబంధం ఉంటుందా? వాళ్లే ఆమెను హత్య చేశారా? మోనా హత్య ఆ నలుగురి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది మిగతా కథ. ఇలా అనూహ్యమైన మలుపులతో ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. అందువల్లనే థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడేవారు నుంచి ఈ సినిమాకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ప్రస్తుతం హిందీ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర భాషలలోను పలకరించే అవకాశం ఉంది. 



More Telugu News