శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల దారి మళ్లింపు

--
శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన పలు విమానాలను అధికారులు దారిమళ్లించినట్లు సమాచారం. విమానాశ్రయం పరిసరాల్లో వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయం పరిసరాల్లో నిన్నటి నుంచి ప్రతికూల వాతావరణం నెలకొందని చెప్పారు.

వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రావాల్సిన విమానాలలో కొన్నింటిని బెంగళూరుకు మరికొన్నింటిని విజయవాడకు మళ్లించినట్లు పేర్కొన్నారు. లఖ్‌నవూ, కోల్‌కతా, ముంబై, జయపుర నుంచి వచ్చే వాటిని బెంగళూరుకు డైవర్ట్‌ చేయగా.. బెంగళూరు నుంచి వచ్చిన విమానాన్ని విజయవాడలో ల్యాండ్ చేయించినట్లు తెలిపారు.

కాగా, బుధవారం ఉదయం పరిస్థితి అనుకూలించడంతో తిరిగి విమానాలు శంషాబాద్‌కు వచ్చాయి. కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.


More Telugu News