నేడు తాడేపల్లికి జగన్
- ఈ రోజు సాయంత్రం 7.10 గంటలకు బెంగళూరు నుంచి గన్నవరం చేరుకోనున్న జగన్
- రోడ్డు మార్గంలో 7.40 గంటలకు తాడేపల్లి నివాసానికి
- రేపు హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ
సింగయ్య మృతికి సంబంధించిన కేసులో వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై రేపు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో పిటిషనర్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
గత విచారణ సందర్భంలో జగన్‌తో పాటు ఇతర వైకాపా నేతలను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రేపు వెలువడే ఉత్తర్వులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో రేపు వైఎస్ జగన్ తాడేపల్లిలో ముఖ్య నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.