మెదక్ జిల్లా కోర్టు భవనం పైనుంచి దూకిన కుటుంబం... ఒకరి మృతి

  • కోర్టు భవనం పైకి వెళ్లిన దంపతులు, ఇద్దరు కుమార్తెలు
  • భవనం పైనుంచి దూకిన కుటుంబ సభ్యులు
  • భార్య మృతి, మిగతా వారికి తీవ్రగాయాలు
  • చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కోర్టు భవనం పైనుంచి దూకి ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శనివారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం, దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి కోర్టు భవనం పైకి చేరుకొని, అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.

ఈ దుర్ఘటనలో భార్య మృతి చెందగా, భర్త మరియు ఇద్దరు కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను దౌలతాబాద్ గ్రామ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News