తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం

  • జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మండలంలో తప్పిన ప్రమాదం
  • మంత్రి కారును ఢీకొట్టిన మరో కారు
  • ఊడిపోయిన కారు టైరు
  • మరో కారులో ఇంటికి వెళ్లిన మంత్రి లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మండలం మారుతీ నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మంత్రి ప్రయాణిస్తుండగా... ఆయన కారును మరో కారు ఢీకొట్టింది. దాంతో ఆయన కారు టైరు ఊడిపోయింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతింది. కారు ప్రమాదానికి గురికావడంతో ఆయన మరో వాహనంలో తన నివాసానికి చేరుకున్నారు.

ఆయన కొద్ది రోజుల క్రితమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించిన క్రమంలో ముగ్గురికి అవకాశం లభించగా, వారిలో అడ్లూరి లక్ష్మణ్ ఒకరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.


More Telugu News