Thota Chandrasekhar: తిరుమల శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు ఎన్నారై భారీ విరాళం

Thota Chandrasekhar Google VP Donates to Tirumala SV Pranadana Trust
షార్ట్స్‌లో చూడండి
టీటీడీకి గురువారం భారీగా విరాళాలు అందాయి. ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్ వైస్ ప్రెసిడెంట్, ఎన్నారై అయిన తోట చంద్రశేఖర్ టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయల భారీ విరాళాన్ని అందించారు. మరోవైపు అమలాపురానికి చెందిన ఓ భక్తుడు పెద్ద సంఖ్యలో హెల్మెట్లను దేవస్థానానికి సమర్పించారు.

గూగుల్ సంస్థలో కీలక పదవిలో ఉన్న తోట చంద్రశేఖర్, తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు తనవంతుగా కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఛైర్మన్ బీఆర్‌ నాయుడుకు అందజేశారు. తోట చంద్రశేఖర్ చూపిన ఈ దాతృత్వానికి టీటీడీ ఛైర్మన్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా టీటీడీ అనేకమంది పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ అనే భక్తుడు టీటీడీకి తనవంతు సహాయం అందించారు. ఆయన సుమారు రూ. 15 లక్షల విలువ చేసే 2వేల‌ హెల్మెట్లను టీటీడీకి  విరాళంగా ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడును కలిసి సత్యనారాయణ ఈ హెల్మెట్లను అందజేశారు. దేవస్థానం అవసరాలకు ఈ హెల్మెట్లు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. 
Go Back to Shorts
Thota Chandrasekhar
Tirumala
TTD
SV Pranadana Trust
Google Vice President
NRI Donation
BR Naidu
Nimmakayala Satyanarayana
Helmets Donation
Amalapuram

More Telugu News