అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ వార్నింగ్.. తగిన శాస్తి తప్పదన్న ఖమేనీ
- అమెరికా దాడులను తీవ్రంగా ఖండించిన ఖమేనీ
- అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్ర హెచ్చరిక
- శత్రువులు తమ దుందుడుకు చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్య
- 'జయోనిస్ట్ శత్రువు శిక్ష అనుభవిస్తున్నాడు' అంటూ ఎక్స్ వేదికగా ఖమేనీ పోస్ట్
ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఖమేనీ తొలిసారిగా స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' లో పోస్ట్ చేశారు. "శిక్ష కొనసాగుతోంది. జయోనిస్ట్ శత్రువు (ఇజ్రాయెల్) చాలా పెద్ద తప్పు చేసింది. ఘోరమైన నేరానికి పాల్పడింది. దానికి శిక్ష పడుతోంది. అది తప్పకుండా శిక్ష అనుభవిస్తుంది" అని ఖమేనీ తన పోస్టులో పేర్కొన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమాల విషయంలో కొంతకాలంగా పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా దాడుల ఆరోపణలతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ వైపు నుంచి ఎలాంటి ప్రతిచర్యలు ఉంటాయోనన్న ఆందోళన అంతర్జాతీయ సమాజంలో వ్యక్తమవుతోంది.