ఈ వారం ఓటీటీలో సినిమాలు, సిరీస్ లు ఇవే!

  • థియేటర్లలో సందడి చేస్తున్న కుబేర, 8 వసంతాలు, సితారే జమీన్ పర్, 28 ఇయర్స్ లేటర్ మూవీలు
  • ఓటీటీలో ఒకేరోజు 11 సినిమాలు
ఒకవైపు థియేటర్లలో కొత్త సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొన్ని సినిమాలు సందడి చేస్తున్నాయి. నిన్న ఒకేరోజు ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటించిన కుబేర మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. దీనితో పాటు తెలుగులో 8 వసంతాలు మూవీ, బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్, హాలీవుడ్ నుంచి 28 ఇయర్స్ లేటర్ మూవీలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఈ వారం అనేక వెబ్ సిరీస్‌లు, మూవీలు ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి.

ఓటీటీలో నిన్నటి నుంచి ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయంటే.. జియో హాట్ స్టార్‌లో కేరళ క్రైమ్‌ఫైల్స్ 2 (వెబ్ సిరీస్: సీజన్ 2), పౌండ్ (వెబ్ సిరీస్ : సీజన్ 2), ఆహాలో అలప్పుళ జింఖానా, నెట్‌ఫ్లిక్స్‌లో కే – పాప్: ది డీమన్ హంటర్స్, గ్రెన్‌ఫెల్ అన్‌కవర్డ్ (డాక్యుమెంటరీ), ఒలింపో (వెబ్ సిరీస్), సెమీ సొయిటర్ (ఇంగ్లీష్), జీ 5లో డిటెక్టివ్ షెర్డిల్ (వెబ్ సిరీస్), గ్రౌండ్ జీరో, ప్రిన్స్ ఫ్యామిలీ సందడి చేస్తున్నాయి. 


More Telugu News