ఐదు టెస్టుల సిరీస్ కు తెరలేచింది... టీమిండియాపై టాస్ గెలిచిన ఇంగ్లాండ్

  • భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం
  • లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్ట్ మ్యాచ్
  • టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది
  • మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు టెస్టుల సిరీస్‌కు తెరలేచింది. ఈ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో నేడు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది.

యువ కెప్టెన్ గిల్ నాయకత్వంలో బరిలో దిగిన భారత్ ఈ సిరీస్ ను చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, సొంతగడ్డపై బెన్ స్టోక్స్ సేనను తక్కువగా అంచనా వేయలేం. బజ్ బాల్ క్రికెట్ తో దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ తమకు అనుకూలమైన పరిస్థితుల్లో చెలరేగిపోతుంది. దాంతో ఈ సుదీర్ఘ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జట్ల వివరాలు
భారత జట్టు (ప్లేయింగ్ ఎలెవన్): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

ఇంగ్లాండ్ జట్టు (ప్లేయింగ్ ఎలెవన్): జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.



More Telugu News