టీడీపీ కార్యకర్తలపై చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వనన్న చంద్రబాబు
- కార్యకర్తకు కోపం వస్తే కాడి పడేస్తాడు కానీ పార్టీ మారడని వ్యాఖ్య
- ప్రజల మద్దతు ఉన్న నాయకులకు పెద్ద పీట వేస్తామని వెల్లడి
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా శక్తిమంతులని, అలక వస్తే కాడి వదిలేస్తారే కానీ వేరే పార్టీలోకి వెళ్లరని ఆయన అన్నారు. నిన్న విశాఖపట్నం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వి కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమీక్షలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నొచ్చుకునే పరిస్థితి ఇకపై ఎప్పుడూ రానివ్వనని అన్నారు.
ఎత్తిన జెండా దించకుండా పార్టీ కోసం పని చేసే కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారని, వారే పార్టీకి బలం, బలగమని పేర్కొన్నారు. కార్యకర్తలు నొచ్చుకునే పరిస్థితి, మనం ఓడిపోయే పరిస్థితి మళ్లీ రానివ్వనని అన్నారు. కోటి సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అని, అందుకే ఇక నుంచి సగం రోజు ప్రభుత్వం, ప్రజల కోసం, సగం రోజు కార్యకర్తల కోసం పని చేస్తానని చెప్పారు.
కార్యకర్తలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల మద్దతు ఉన్న నాయకులు, కార్యకర్తలకు పెద్ద పీట వేస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగిందని, తమపై నమ్మకంతో భారీ మెజార్టీ ఇచ్చారన్నారు. ఢిల్లీలో కూడా పలుకుబడి పెరిగిందని అన్నారు.