ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
  • వివాదాస్పద భూమిలో ఉన్న సొసైటీ గదిని జేసీబీతో కూల్చివేశారని ఫిర్యాదు
  • కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
  • తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.

తొమ్మిదేళ్ల క్రితం గోపన్‌పల్లిలోని వివాదాస్పద భూమిలో ఉన్న సొసైటీ గదిని జేసీబీతో కూల్చివేశారని, కులం పేరుతో దూషించారని రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మణ్‌పై పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

దీనిపై అప్పట్లో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై పెద్దిరాజుకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.


More Telugu News