వాస్తవాలను వెల్లడించడం కేసీఆర్ బాధ్యత: కోదండరాం
- కాళేశ్వరంపై కేసీఆర్ విచారణను తప్పుబట్టొద్దన్న కోదండరాం
- ప్రజాధనం ఖర్చు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం
- కేసీఆర్ హాజరుపై కొందరి రాద్ధాంతం సరికాదని విమర్శ
"తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయి, రాష్ట్రానికి అప్పు మాత్రం మిగిలింది" అని వ్యాఖ్యానించారు. కమిషన్ ముందు హాజరై వాస్తవాలు వెల్లడించడం కేసీఆర్ బాధ్యత అని ఆయన అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజా సమస్యలను వింటోందని, గత ప్రభుత్వ హయాంలో అలాంటి అవకాశం కూడా దొరకలేదని కోదండరాం అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి నగర కమిటీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జన సమితి కార్యకలాపాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.